_ఇంద్రేశం గ్రామంలో జి.వి.ఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో 7 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
_అమీన్పూర్ మండలం వడకపల్లి గ్రామంలో కోటి 95 లక్షల రూపాయల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు, పరిశ్రమల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో 7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గ్రామంలో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి శంకుస్థాపన చేశారు.అమీన్పూర్ మండల పరిధిలోని వడక్పల్లి గ్రామంలో ఒక కోటి 95 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ పూర్తి పారదర్శకతతో పరిపాలన అందిస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం రోజు రోజుకి విస్తరిస్తోందని, ఇందుకు అనుగుణంగా ఏర్పడుతున్న నూతన కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, రామచంద్ర రెడ్డి, ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, వడకపల్లి గ్రామ సర్పంచ్ లలిత మల్లేష్, ఉపసర్పంచ్ బండి శంకర్, శ్రీకాంత్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు , సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…