మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలే కాకుండా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఆయన అన్నారు.మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దేవాలయ స్లాబ్ నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి స్లాబ్ పనులను నీలం మధు ముదిరాజ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాలయాల నిర్మాణంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తుల మనసుల్లో శాంతి, భక్తి భావనలు పెంపొందుతాయని తెలిపారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం లక్డారం గ్రామానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.ఇప్పటికే ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయంగా విరాళం అందజేశానని, భవిష్యత్తులో కూడా ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి చొరవ చూపుతున్న ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు…
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐఐటీ హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ ప్రభాత్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రకృతి, భౌతికశాస్త్రం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ…
పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువత…
ఐదు రోజుల బూట్ క్యాంప్ ప్రారంభోత్సవంలో సీ-డాక్ హైదరాబాద్ నిపుణుడు ప్రణయ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మన దేశ…