శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
మియాపూర్ నడిగడ్డ తండా సమీపంలో గల సి ఆర్ పి ఎఫ్ వారు నిర్మిస్తున్న కట్టడాలను ఆపాలని రాజేంద్రనగర్ ఆర్ డి ఓ కు నడిగడ్డ తాండ వాసులు వినీతిపత్రం అందించారు. బస్తిలో నిరుపేదలకు కనీసo చిన్న చిన్న మరమ్మతులే కాకుండ ప్రభుత్వం ద్వారా మంజూరైనా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు పైపు లైన్, విద్యుత్ ట్రాన్స్ ఫారం వంటి కనీస మౌలిక వసతులను కూడా నిరాకరించే సి ఆర్ పి ఎఫ్ వారు ఎలాంటి అనుమతులు లేకుండా భా రికట్టాడాలకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. దానికి వారు సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోగిరిజన సంక్షేమ నాయకులు స్వామి నాయక్,తిరుపతి నాయక్, మోహన్ నాయక్, ఈస్వార్ మంగలి, మాన్య నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు