కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం ….
-కాళీ చరణ్
హైదరాబాద్:
కరోనా కేసులు పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్ నుంచి క్రిమేషన్ వరకు అన్ని రకాల సర్వీసులు అందించేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. కరోనా రోగులకు సహాయం అందించేందుకు కో హెల్ప్ యాప్ ను ,వెబ్‌సైట్‌ను సాగర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ రూపొందించింది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ బెడ్స్, అంబులెన్స్, ఆక్సిజన్ ఫెసిటిటీ,రెమిడెసివర్ వంటి మెడికల్ ఫెసిలిటీస్ సమాచారం యాప్‌లో అందుబాటులో ఉంటుందని నిర్వహకులు తెలిపారు .
భవిష్యత్‌లో ఇండియా మొత్తం సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు సంస్థ సీఈఓ రితీష్ వెంకట్ తెలిపారు.
ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్స్,ఆక్సిజన్ ,అంబులెన్స్, వ్యాక్సినేషన్ తదితర విషయాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు యాప్‌ను తీసుకురావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్ అన్నారు .
హైదరాబాద్ అరణ్యభవన్‌లో సాగర్ సాఫ్ట్‌వేర్ సంస్థ రూపొందించిన కో హెల్ప్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు నాలుగువేల ఆసుపత్రులతో తాము టై అప్ అయ్యామని …కోవిద్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే చికిత్స అందించేలా ఈ యాప్ రూపకల్పన జరిగిందని సాగర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సీఈఓ జోగి రితీష్ వెంకట్ తెలిపారు.
యాప్ ద్వారా బెడ్ బుక్ చేసుకున్న కరోనా పేషెంట్లకు ఎక్కువ మొత్తం వసూలు చేస్తే …ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కరిస్తామన్నారు .తమ యాప్‌కు తెలుగు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని …మొదటి రోజు రెండువందల మందికిపైగా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కరోనా సర్వీసులు పొందుతున్నట్లు రితీష్ తెలిపారు.