పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీకి చెందిన గంగాధర్ రెడ్డి కుమారుడు సాయి కిరణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. బాలుడు చికిత్స కోసం మంజూరైన 2 లక్షల 50వేల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని సోమవారం ఎంఎల్ఏ జిఎంఆర్ బాలుడు తండ్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, దేవానంద్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అంతిరెడ్డి, భాస్కర్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.