పటాన్ చెరు
నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ వరప్రదాయినిగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు మంజూరైన ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రధాన ఆసుపత్రుల్లో డయాగ్నొస్టిక్ హబ్ లు ఏర్పాటుచేసి ఖరీదైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, కాజిపల్లి సర్పంచ్ సత్యనారాయణ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.