హైదరాబాద్:
గులాబీ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో నేడు సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం (28 .9 ..2021 )సెలవు ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి గారి ఆదేశాలననుసరించి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సి.ఎస్. ఆదేశించారు. అయితే, అత్యవసర శాఖలైన రెవిన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ లు విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాల వాళ్ళ ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సి.ఎస్. సోమేశ్ కుమార్ తెలియ చేశారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…