పటాన్చెరులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన
మనవార్తలు , పటాన్ చెరు:
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న నూతన సంస్కరణలకు అనుగుణంగా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరింత కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్చెరు పట్టణంలో నూతనంగా నిర్మించ దలచిన డి సి సి బి నూతన బ్రాంచ్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులతో పాటు చిరు వ్యాపారులకు, సంస్థలకు వివిధ పథకాల ద్వారా రుణాలు అందించడంలో డిసిసిబి ముందంజలో ఉందని అన్నారు.
ఎప్పటికప్పుడు బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరితగతిన భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. బ్యాంకు అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జిల్లా చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మాణిక్యం, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, డైరెక్టర్లు, పిఎసిఎస్ చైర్మన్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.