కార్మికుల హక్కుల కోసం సిఐటియు రాజిలేని పోరాటం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

కార్మికుల హక్కుల కోసం సిఐటియు రాజిలేని పోరాటం చేస్తున్నట్లు సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య పేర్కొన్నారు. పటాన్ చెరు పట్టణంలోని శ్రామి భవన్ లో ఆదివారం సాయంత్రం జరిగిన పెన్నార్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కే రాజయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలన్నీ సిఐటియు ద్వారానే పరిష్కారం అవుతాయని వారి సమస్యలపై నిరంతరం పోరాడే సంఘం సిఐటియు అన్నారు. సిఐటియు ఉన్నచోట మాత్రమే కార్మికులకు హక్కులు పరిరక్షించబడుతాయని, వేతన ఒప్పందలు, బోనస్ అన్ని సౌకర్యాలు సాధించడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్మికులందరూ సిఐటియు ద్వారానే తమ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని, భరోసా ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మిక హక్కుల విషయంలో సిఐటియు రాజీ పడదని, ఇతర సంఘాలు మాత్రమే రాజీ పడటంతో పాటు కార్మికులను తాకట్టు పెడతాయని ఆరోపించారు. కార్మికుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని, పోరాడితేనే హక్కులు సాధించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సమావేశంలో యూనియన్ నాయకులు శేషగిరిరావు, త్రిమూర్తులు, రాజు, దాసు, అర్జున్, రాజు, నగేష్, పాండురంగారెడ్డి తదితర కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *