కిర్బీ పరిశ్రమ

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం

Districts Telangana

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం....

పటాన్ చెరు:

పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీపరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియు వరుసగా రెండవసారి విజయకేతనం ఎగురవేసింది.పరిశ్రమలో 559 ఓట్ల కు గాను 553 ఓట్లు పోల్ అవగా ఆరు ఓట్లు వేయలేదు. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు. బిఎంఎస్ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి.టిఆర్ఎస్కెవి తరఫున ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లు పోటీలో ఉన్నారు.

సీఐటీయూకు 192. బి ఎం ఎస్ కు 190. టీఆర్ఎస్ కె.వి కి 170 ఓట్లు రాగా. 2 ఓట్ల తో బిఎంఎస్ పై సిఐటియు గెలుపొందింది. ఈ సందర్భంగా కార్మికులు సందడి సందడి చేశారు. బాణసంచా కాల్చి విజయ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బీరం మల్లేశం కే రాజయ్య లు మాట్లాడుతూ సిఐటియు నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మికులు రెండవసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. కార్మికులకు ఎల్లవేళలా అండగా నిలుస్తు కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్న ఏకైక కార్మిక సంఘం సిఐటియు అన్నారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా కార్మిక సంక్షేమమే సీఐటీయూ ధ్యేయమని అన్నారు. కార్మికులకు రావలసిన చట్ట పరమైన హక్కుల కోసం ముందుండి పోరాడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నర్సింహారెడ్డి. నాగేశ్వరరావు. కిర్బీ పరిశ్రమ జనరల్ సెక్రటరీ వి ఎస్ రాజు. రవీందర్. శ్రీనివాస్ ఇతర కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *