పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం మానుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 120,121,125 లలోని భూములను ఆయన పరిశీలించారు . అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దకంజర్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని రియల్టర్లు ఆక్రమించున్నారని వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు . ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్న జిల్లా అధికారులకు ఎందుకు చోద్యం చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భూ కబ్జాలపై గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు . ప్రజా అవసరాల కోసం ఎంతో విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం మానుకోవాలన్నారు. రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని .రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 126 సర్వే నెంబర్ లో 10 ఏకారాల భూమిలో రెడిమిక్స్ పెట్టి ఆక్రమించుకున్నారని అన్నారు.2013 చట్టం ప్రకారం తప్పని పరిస్థితుల్లో రైతులు ఒప్పుకుంటే అమలు చేయాలని ,బహిరంగ మార్కెట్లో ఏకరకు 5 కోట్ల రూపాయల పలుకుతోంది అని అన్నారు. గ్రామ రైతులకు న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మైసాయ్య,శేఖర్,రైతులు పాల్గొన్నారు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…