Telangana

పెద్ద కంజర్లలో సరస్వతీ మాత విగ్రహావిష్కరించిన_ చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు

నేటి దాత్రి: చదువుల తల్లి సరస్వతి అనుగ్రహంతో విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్ తన పుట్టినరోజును పురస్కరించుకొని సొంత నిధులతో పెద్దకంజర్ల ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని నిర్మించారు. సోమవారం పెద్దకంజర్ల ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన లక్ష్మణ్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలు దేవాలయాలతో సమానమని, అలాంటి దేవాలయంలో సరస్వతి దేవి విగ్రహాలను ప్రతిష్టించడం మంచి సంప్రదాయమన్నారు.

సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు మంచి నడవడికతో విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన అభిలాషించారు. విద్యతో సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని నమ్మి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మన ఊరు మనబడి ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చి వేస్తుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్, ఉప సర్పంచ్ హరీశంకర్ గౌడ్, వార్డు సభ్యులు నరేష్ రెడ్డి, మల్లేష్, చిత్తారి, సరోజనమ్మ, నర్సమ్మ, మనోహరమ్మ, భాస్కర్, ఇమ్రాన్, నాగభూషణం, ముత్యాలు, సతీష్, నిరంజన్, రాజు, బలరామ్, రమేష్, గ్రామ పెద్దలు, ప్రజలు, పెద్ద కంజర్ల ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago