politics

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశనానికే ఆదర్శం _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు:

దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.చిట్కుల్ గ్రామంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ సంబరాలు తెరాస జెండాను ఆవిష్కరించి, కేకు కట్ చేసి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కొత్త రాష్ట్రం వచ్చాక రెండుసార్లు కేసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తెరాసకు మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గతంలో తెరాస జెండా పట్టుకోని వారిని సైతం వారిచేత జెండా రెపరెపలాడించేలా చేశారని అన్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, వృద్ధాప్య, అసారా పింఛన్లే కాక కేసీఅర్ కిట్టు ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకు పోతున్నారని తెలిపారు. దేశానికి చుక్కానిలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు నిలుస్తున్నాయి ఆయన తెలిపారు.

తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని చెప్పిన నల్లారి కిరణ్ కుమార్ మాటలను తారుమారు చేస్తూ 24 గంటల కరెంటు అందిస్తూ తెలంగాణలో వెలుగులు పంచుతుంటే పక్క రాష్ట్రంలో లో చీకటి బతుకులు అయ్యాయని ఎద్దేవాచేశారు ప్రధాని సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి కిసాన్ పథకంలో నగదు జమ చేస్తున్నారని అన్నారు. దళిత బంధు త్వరలో అర్హులందరికీ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని  అంబేద్కర్ ఆశయాల మేరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కుల మత వర్గాలకు అతీతంగా తెలంగాణలో పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను సుందరాంగి తీర్చిదిద్దారన్నారు. సుల్తాన్ పూర్ వంటి పారిశ్రామిక వాడలు నెలకొల్పి చాలామందికి ఉపాధి కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ విలేజ్ ప్రసిడెంట్ ప్రశాంత్, పిఎసిఎస్  చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, క్రిష్ణ, వెంకటేష్, బుజంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఎన్ఎమ్ఎమ్ యువసేన పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago