ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం మూర్ఖత్వం _బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్

Districts politics Telangana

మనవార్తలు , పటాన్ చెరు:

భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసనగా పటాన్ చెరు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నిరసనవ్యక్తం చేశారు. అనంతరం బిఎస్పి నాయకులు తహశీల్ధారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పటాన్ చెరు నియోజకవర్గం బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని ఆర్టికల్ 3ఏ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానిని హేళన చేస్తూ, దానికి తూట్లు పొడుస్తూ, అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు .

కేసిఆర్ రాజ్యాంగం పట్ల కానీ రాజ్యాంగాన్నినిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పడడానికి మూల కారణం రాజ్యాంగం అని అన్నకేసిఆర్ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అని అనడం ఎంతవరకు సమంజసం అని వారు సీఎంను ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు అన్ని రాజ్యాంగాన్ని అది రాసిన అంబేద్కర్ ను గౌరవిస్తూ ఉంటే మొదటగ బీజేపీ పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను బట్టి నీ ఇంట్లో రాజకీయ ఉద్యోగాలు కట్టబెట్టావని ఇటువంటి అంశాలను విమర్శించే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని ధ్వజమెత్తారు భారత జాతికి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో తీవ్రపరిమాణాలను ఎదుర్కొంటారని బిఎస్పి నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పఠాన్ చేరు అసెంబ్లీ అధ్యక్షులు సుంకు వినయ్ కుమార్ ,అసెంబ్లీ ఇంఛార్జ్ సంజీవ ,అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రవీణ్,పఠాన్ చేరు మండల కన్వీనర్ వెంకటేశ్, కర్నె శ్రీధర్,గుమ్మడిదల మండల కన్వీనర్ నీరుడి శివకుమార్, తెల్లపూర్ పీన్సిపాలిటీ అధ్యక్షుడు దర్శన్ ,అమీన్ పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాములు,111 డివిజన్ అధ్యక్షుడు శ్రీశైలం ,113 డివిజన్ అధ్యక్షుడు మహేందర్,ఉపాధ్యక్షుడు బాలు రేవంత్ ,మరియు ప్రెసిడెంట్స్ బాను ,రామకృష్ణ ,కిరణ్ ,సామ్ సన్ మరియు బీఎస్పీ కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *