_గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ మహారాజ్
_పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనదక్షుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటుచేసిన భారీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆదివారం రాత్రి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడు గానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడుగా పేరు పొందారని అన్నారు. చరిత్రలో గొప్ప నాయకులుగా కీర్తించబడ్డ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. వారి చరిత్రను, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నేటి తరానికి తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో శివాజీ విగ్రహాల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. యువత పెడదారి పట్టకుండా దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…