నీలం మధు ముదిరాజ్ ను సన్మానిస్తున్న చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం
_చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం
మనవార్తలు ,పటాన్ చెరు:
నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన చిట్యాల (చాకలి) ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిట్కుల్ గ్రామంలో విగ్రహ దాత నీలం మధు ముదిరాజ్ ను రాష్ట్ర రజక సంఘం నేతలతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరుగని ధైర్యసాహసాలను ప్రదర్శించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని నింపుతూ ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రజకుల తరపున మధుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి జీతయ్య, చిట్కుల్ వెంకటేశ్, సత్తయ్య, ఆంజనేయులు, సురేష్ లతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…