Districts

నూతన విద్యా విధానంలో మార్పుకు పెద్దపీట… – గీతం ఆతిథ్య ఉపన్యాసంలో హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డెరైక్టర్

పటాన్ చెరు:

నూతన విద్యా విధానం ( ఎన్ఎస్ఈపీ ) పరివర్తనాత్మక మార్పుకు ఉద్దేశించారని , సృజనాత్మక అంశాల మేలు కలయికతో పాఠ్యాంశాల రూపకల్పనతో సహా వీలయినప్పుడు విద్యను కొనసాగించే వెసులుబాటు కూడా ఉందని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డెరైక్టర్ ( హెస్ఆర్డీసీ ) ప్రొఫెసర్ వె.నరసింహులు అన్నారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ జాతీయ విద్యా విధానం’పై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . గూగుల్లో అందుబాటులో ఉన్న దానికంటే నాణ్యమైన బోధన చేయగలిగిన అధ్యాపకులు విద్యార్థుల మన్ననలను చూరగొనగలరని అన్నారు . పాఠ్యాంశాలను స్వల్ప నిడివి గల వీడియోలుగా రూపొందించి పరిమితి విధించకుండా విద్యార్థులందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు .

సబ్జెక్టుల ఎంపికలో విద్యార్థి అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని , ఆన్లైన్లో నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు . డిస్రష్టివ్ సాంకేతికతల ఆవిర్భావాన్ని నొక్కిచెబుతూ , ఇది మన భవిష్యత్తునే మార్చబోతోందని చెప్పారు . ప్రశ్నించే ధైర్యంతో పాటు సృజనాత్మక నిర్మాణంతో కూడిన విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు . చాలా ఉద్యోగాలు అభిజ్ఞా నైపుణ్యాలు ( కాగ్నెటివ్ స్కిల్స్ ) తో ముడిపడి ఉన్నాయని , చక్కగా రాయడం , మంచి భావప్రకటనా నెపుణ్యాలు ఉన్నవారిని పరిశ్రమ కోరుకుంటోందని చెప్పారు .

కళాశాలలో సీటు నుంచి ఉద్యోగాలకు ఇంటర్వ్యూల వరకు ప్రతి దశలోనూ విద్యార్థిని పరీక్షిస్తారని , అందువల్ల మార్కుల గురించి అధ్యాపకులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని , వారిలో నైపుణ్యాలు పెంపొందించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు . ఆన్లైన్ కోర్సులు , డిజిల్ రిపోజిటరీలు , పరిశోధనలకు నిధులు , మెరుగైన సేవలు , మూక్స్ , క్రెడిట్ ఆధారిత గుర్తింపు వంటి వాటికి నూతన విద్యా విధానం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు . తొలుత , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ అతిథిని స్వాగతించగా , ప్రొఫెసర్ కె.మంజునాథాచారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది .

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago