వికలాంగులను చైతన్యపరిచే విధంగా ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషి అభినందనీయం

గీతం రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ వర్మ ఎన్ పి అర్ డి క్యాలెండర్ ఆవిష్కరణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వికలాంగులను చైతన్యపరిచే విధంగా ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషి అభినందనీయమని గీతం రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ వర్మ అన్నారు.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్ ను గురువారం గీతం యూనివర్సిటి ప్రాంగణంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు […]

Continue Reading

మెదడుకు పదునుపెట్టిన సాంకేతికోత్సవం

గీతంలో ఎపోచ్ 4.0 పేరిట మూడు రోజుల సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఎపోచ్ 4.0 పేరిట ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించిన సాంకేతికోత్సవాలు విద్యార్థుల మెదడుకు పదును పెట్టాయి. గీతం స్టూడెంట్స్ క్లబ్ సహకారంతో గిట్ హబ్ కమ్యూనిటీ నిర్వహించిన ఈ పోటీలు- ఆచరణాత్మక అభ్యాసం, పరస్పర సహకారం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై పట్టును పెంపొందించే లక్ష్యంతో సాగాయి.టెక్ ట్రివియాతో ఆరంభమైన ఈ […]

Continue Reading

ఎగిరిన డ్రోన్, పెరిగిన ఆత్మవిశ్వాసం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: డ్రోన్ బూట్ క్యాంపు నాలుగో రోజు, గీతం విద్యార్థులు డ్రోన్ అసెంబ్లీపై స్వీయ అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు, వాటిని ఎగరవేయడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిపుణుల మార్గదర్శనంలో, ఏడు క్వాడ్ ఎక్స్ కాప్టర్లను విజయవంతంగా పరీక్షించారు. డ్రోన్ నిర్మాణం, పనితీరు పరీక్షలో విలువైన ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు.జీపీఎస్ ఆధారిత హెక్సాకాప్టర్ ను ఎగరవేయడానికి విద్యార్థులకు అవకాశం ఇచ్చారు. ఇది పరిశ్రమ స్థాయి డ్రోన్లలో ఉపయోగించే అధునాతన నావివేషన్, విమాన స్థిరీకరణ, నియంత్రణ వ్యవస్థలను […]

Continue Reading

వ్యర్థాల నిర్వహణకు ఐటీసీ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ వావ్ (WOW) అవార్డుతో సత్కరించింది. కాగితపు వ్యర్థాల పునర్ వినియోగం, స్థిరమైన ప్రాంగణ పద్ధతులు, గీతం అత్యుత్తమ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ కు అనుగుణంగా, వనరుల విభజన, పునర్వినియోగంలో రాణించిన పాఠశాలలు, సంస్థలకు హైదరాబాదులోని ఐటీసీ వావ్ ఈ అవార్డులను ప్రదానం చేసింది.బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను మరింత […]

Continue Reading

అంతర్జాతీయ సదస్సులో గీతం వాణి

ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ లో స్మార్ట్ ట్రెండ్స్ (స్మార్ట్ కామ్-2026) పదో అంతర్జాతీయ సమావేశం ప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. సమకాలీన పరిశోధన దిశ, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ల డొమైన్ లలో ఇటీవలి సాంకేతిక పురోగతిపై విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. ఆమె ప్రసంగం సదస్యుల మన్ననలను […]

Continue Reading

ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం _ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలే కాకుండా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఆయన అన్నారు.మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దేవాలయ స్లాబ్ నిర్మాణ పనులను   కొబ్బరికాయ కొట్టి […]

Continue Reading

ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమేషన్ పై శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు ‘ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమేషన్’ పై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు వాస్తవ-ప్రపంచ సెన్సార్ ఇంటర్ ఫేసింగ్ ను ఆచరణాత్మకంగా నేర్చుకుంటున్నారు.స్మార్ట్ ఎనర్జీ మానిటరింగ్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ గేట్ వే సొల్యూషన్స్ వంటి అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. అంతేగాక, జాతీయ విద్యా విధానం 2023కు అనుగుణంగా […]

Continue Reading

ప్రకృతి ప్రేరణతో అద్భుత డిజైన్లు

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐఐటీ హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ ప్రభాత్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రకృతి, భౌతికశాస్త్రం నుంచి ప్రేరణ పొందిన ఆప్టిమైజేషన్ సూత్రాలు తక్కువ ఖర్చుతో కూడుకున్న, సమర్థవంతమైన నిర్మాణ డిజైన్లకు దారితీస్తాయని ఐఐటీ హైదరాబాదులోని మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాత్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘టోపాలజీ ఆప్టిమైజేషన్: సిద్ధాంత, ఆచరణ’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య […]

Continue Reading

ఐనోల్ మల్లన్న స్వామి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు . ఈ జాతర కార్యక్రమానికి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గ్రామస్తులు సంప్రదాయ వేషధారణతో స్వామివారికి పూజలు నిర్వహించగా, డప్పు చప్పుళ్లు, భజనలు, హారతులతో ఆలయ […]

Continue Reading

కాంగ్రేస్ నయవంచన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారుఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి పీఎస్ ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు . పటాన్ చేరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ […]

Continue Reading