శారద విద్యానికేతన్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

  మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ లో సోమవారం రోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులచే సరస్వతీ పూజ, హోమం మరియు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. నూతనంగా అక్షరాభ్యాసం చేసిన చిన్నారులకు కరస్పాండెంట్ పూర్ణిమ పలకలు, స్కూల్ యూనిఫామ్ మరియు బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పండగ విశిష్టత గురించి ప్రధానోపాధ్యాయురాలు నీరజ విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు […]

Continue Reading

శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు పృథ్వీరాజ్   పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్నటువంటి శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, ఎం.డి.ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. దేవాలయ అధ్యక్షుడు రఘు, మాజీ వార్డ్ మెంబర్ యాదగిరి మరియు గ్రామస్తులు సమక్షంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ భక్తుల ఆధ్యాత్మిక శ్రద్ధను ప్రోత్సహించేలా […]

Continue Reading

జిహెచ్ఎంసి కార్మికుల సేవలు మరువలేనివి _ ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణానికి గత 40 సంవత్సరాలుగా అంకితభావంతో సేవలు అందించిన ట్రాక్టర్ డ్రైవర్ సత్తయ్య మరియు నీటిపారుదల శాఖలో అప్రతిమ సేవలు అందించిన రాములును, రిటైర్మెంట్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పటాన్చెరు పట్టణానికి దేవేందర్ రాజు సర్పంచ్ ఉన్న సమయంలో అంకితభావంతో పనిచేసి రిటైర్ అయిన సందర్భంగా యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో శాలువాతో సత్కారం చేసి, వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపటాన్చెరు పట్టణ అభివృద్ధిలో వీరి సేవలు […]

Continue Reading

క్లినికల్ రీసెర్చపై విజయవంతంగా ముగిసిన కార్యశాల

డేటా మేనేజ్ మెంట్, మెడికల్ రైటింగ్, ఫార్మకోవిజిలెన్ పై మార్గనిర్ధేశం చేసిన క్లినోసోల్ సీఈవో పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గురు-శుక్రవారాలలో ‘క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ డేటా మేనేజ్ మెంట్, ఫార్మకోవిజిలెన్స్, అండ్ మెడికల్ రైటింగ్’పై నిర్వహించిన రెండు రోజుల కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఈ రంగంలో పేరొందిన క్లినోసోల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ వర్క్ షాపులో ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి […]

Continue Reading

మతసామరస్యానికి ప్రతీక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన జిఎంఆర్ యువసేన నాయకుడు సోహెల్ బృందం ఆధ్వర్యంలో అజ్మీర్ దర్గా వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో చదర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం దర్గాకు చదర్ ను సమర్పించారు. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. […]

Continue Reading

మార్పును అందిపుచ్చుకోండి

వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులకు ప్రొఫెసర్ కరుణాకర్ సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పరిశ్రమ 5.0 దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్ అపారమైన మార్పులకు గురైందని, ఆ మార్పును అందిపుచ్చుకుని విజయ తీరాలను చేరుకోవాలని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) సెంటర్ ఫర్ కేస్ స్టడీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు. జీఎస్బీలోని మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వ్యాపార వృద్ధి కోసం సామాజిక-వాణిజ్యంలో కత్రిమ మేధస్సును ప్రభావంతంగా వినియోగించడం’ అనే […]

Continue Reading

కృత్రిమ మేథను అందిపుచ్చుకోవాల్సిందే

పరిశోధనాంశాలను వెల్లడించిన బ్రిటన్ షెఫీల్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అధునాతన పరిజ్జానాలైన కృత్రిమమేథ (ఏఐ), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)లను భారతీయులు కూడా అందిపుచ్చుకోవాలని, అత్యంత ఖర్చు, వ్యయప్రయాసలతో కూడినదైనా దానిని వదులుకోకూడదని బ్రిటన్, ఫెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని డిజిటల్ మీడియా అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్ అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణలో కృత్రిమ మేథ విధానాలు, మౌలిక సదుపాయాలు, అభ్యాసాలు: ప్రారంభ ముద్రలు’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ […]

Continue Reading

రెండు గ్రామపంచాయతీలను అమీన్పూర్ మున్సిపాలిటీలో చేర్చండి

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్ మండలంలో మిగిలిన. జానకంపేట, వడక్ పల్లి గ్రామాలను అమీన్పూర్ మున్సిపాలిటీలో చేర్చాలని. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ను. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎం ఏ యు డి కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ  అమీన్పూర్ మండల పరిధిలోని […]

Continue Reading

గీతంలో కంటెంట్ రైటింగ్ వర్క్ షాప్ ప్రారంభం

నాలుగు రోజుల పాటు కొనసాగనున్న కార్యశాల నైపుణ్యాలను పెంపొందించనున్న పరిశ్రమ నిపుణులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కంటెంట్ సృష్టి, కమ్యూనికేషన్ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న వాతావరణానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా నాలుగు రోజుల ‘కంటెంట్ రైటింగ్ వర్క్ షాప్’ను గీతం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) మంగళవారం ప్రారంభించారు. మీడియా స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం, విద్యార్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధిలో […]

Continue Reading

భవన నిర్మాణంలో భూకంపాలను తట్టుకునే పరిజ్జానం

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఎన్ఐటీ పూర్వ డీన్ ప్రొఫెసర్ కట్టా వెంకటరమణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భూకంపాలను తట్టుకునేలా భవనాలను రూపొందించేందుకు అత్యాధునిక పరిజ్జానం, వినూత్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఎన్ఐటీ సూరత్కల్ మాజీ డీన్ (విద్య) ప్రొఫెసర్ కట్టా వెంకటరమణ చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఇంజనీరింగ్ భూకంప శాస్త్రం – గత భూకంపాల నుంచి నేర్చుకోవడం’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.భూకంప […]

Continue Reading