ముదిరాజుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : నియోజకవర్గ పరిధిలోని ముదిరాజుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య రోడ్డులో నూతనంగా నిర్మించ తలపెట్టిన ముదిరాజ్ భవనం పనులకు ఆయన ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సేవా దృక్పథం ధైర్యానికి మారుపేరైన ముదిరాజులు […]

Continue Reading

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 లక్షల 85 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందనిపటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు మంజూరైన 19 లక్షల 85 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

రైతుల ఆర్థిక అభ్యున్నతికి కృషి

రుద్రారంలో పిఎసిఎస్ దుకాణాల సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని పిఎసిఎస్ ఆవరణలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన దుకాణాల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో […]

Continue Reading

ఎస్.ఇందిరకు అనువర్తిత గణితంలో పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎస్. ఇందిర డాక్టరేట్ కు అర్హత సాధించారు. లంబ కోన్ పై ఎంహెచ్ డీ  నానోఫ్లూయిడ్ ప్రవాహ సమస్యలపై డబుల్ డిఫ్యూజన్ ప్రభావాలు అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఆమె చేసిన పరిశోధన గణిత నమూనా, నానోఫ్లూయిడ్ డైనమిక్స్ రంగానికి గణనీయమైన కృషిని సూచిస్తోంది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ […]

Continue Reading

దేవాలయాల అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటేల్ గూడలో ఘనంగా వన మహోత్సవం నూతన దేవాలయాల నిర్మాణాలకు.. అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో మాజీ ఎంపీపీ దేవానంద్ సొంత నిధులతో నిర్మించిన శ్రీశ్రీశ్రీ దుర్గామాత దేవాలయం స్వాగత తోరణాన్ని శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని అన్నారు. వనమోత్సవంలో ఎమ్మెల్యే […]

Continue Reading

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి

యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు […]

Continue Reading

ఐక్యత, సమైక్యతా స్ఫూర్తిని కొనసాగించండి

క్యాడెట్లకు కల్నల్ రమేష్ సరియాల్ సూచన విజయవంతంగా ముగిసిన ఎన్ సీసీ శిబిరం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎన్ సీసీ క్యాడెట్లంతా ఐక్యత, క్రమశిక్షణతో మెలగాలని, సమైక్యతా స్ఫూర్తిని కలకాలం కొనసాగించాలని సంగారెడ్డిలోని 33 (టీ) బెలాలియన్ ఎన్ సీసీ క్యాంప్ కమాండెంట్, కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ సూచించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గత పదిరోజులుగా నిర్వహిస్తున్న శిబిరం ముగింపు సమావేశంలో ఆయన క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ శిబిరం క్యాడెట్లను నిజంగా […]

Continue Reading

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల కాలపు ప్రజల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం.. తోడ్పాటుతో పటాన్చెరు నియోజకవర్గాన్ని. అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణల కార్యక్రమానికి […]

Continue Reading

మిస్ తెలుగు యూఎస్ఏ పోటీలో మెరిసిన గీతం పూర్వ విద్యార్థిని

మిస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్ కిరీటం, పీపుల్స్ ఛాయిస్ అవార్డులు కైవసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని చూర్ణికా ప్రియ కొత్తపల్లి మిస్ తెలుగు యూఎస్ఏ 2025 పోటీలో రెండు ప్రతిష్టాత్మక టైటిళ్లను సాధించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించిన చూర్ణిక, ప్రస్తుతం అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నారని, గీతంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-2024) […]

Continue Reading

60 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదులు

ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 60 లక్షల రూపాయల నిధులతో నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ముత్తంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో గల గదులు శిథిలావస్థకు చేరుకోవడం […]

Continue Reading