ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.ఆశిష్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమపై చేసిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.ఆశిష్ గౌడ్ ఖండించారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకుంటూ విమర్శల పాలవుతున్నారని విమర్శించారు. గతంలో ఐలా చైర్మన్ ను ఎమ్మెల్యే బెదిరించిన కేసులో రెండున్నర సంవత్సరాలు శిక్ష పడ్డ విషయం అందరికీ తెలిసిందే అన్నారు. […]

Continue Reading

కళాకారులను సన్మానించే సంస్కృతి మాది.. కళాకారులపై దాడి చేసే విష సంస్కృతి మీది..

_గురువింద గింజ నీతులు.. దయ్యాల మారి వేదాలు.. _సొంత అన్ననే మోసం చేసిన మహోన్నత చరిత్ర మీది.. _మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఎమ్మెల్యే జిఎంఆర్ ఫైర్.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిరాధారణ ఆరోపణలు చేస్తూ రాజకీయాల్లో విలువలను మంటగలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కు ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మారడం లేదని, వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ నుండి నందీశ్వర్ గౌడ్ కి టికెట్ కేటాయిస్తే మరోసారి ప్రజలు […]

Continue Reading

పాశమైలారంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

_సొంత నిధులతో చత్రపతి శివాజీ విగ్రహాన్ని అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణ తల్లి విగ్రహాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. 2 లక్షల 50 వేల రూపాయల సొంత నిధులతో ఎమ్మెల్యే జీఎంఆర్ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు […]

Continue Reading

దేశంలోనే విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ్ కీ నేతగా, దేశ రాజకీయాల్లో కీలక ఘట్టాన్ని రూపొందించబోయే మహా నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ,పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో  కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి కేసీఆర్ […]

Continue Reading

నేడే పటాన్చెరులో మహాశివరాత్రి మహా జాగరణ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శనివారం సాయంత్రం 6 గంటలకు పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించ తలపెట్టిన మహాశివరాత్రి మహా జాగరణ, స్వర లింగోద్భవ కార్యక్రమాల ఏర్పాటును పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. జాగరణకు హాజరై భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులందరూ సాయంత్రం 6 గంటల లోపు మైత్రి గ్రౌండ్స్ కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ […]

Continue Reading

పటాన్చెరు పట్టణంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

_కారణజన్ముడు సీఎం కేసీఆర్ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంతో పాటు భావి భారతానికి దశాబ్ దిశను నిర్దేశించిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. అనంతరం […]

Continue Reading

గీతమ్ ప్రమాణ జోష్

_అలరించిన మూడు రోజుల చెక్నో-మేనేజ్ మెంట్-కల్చరల్ ఫెస్ట్ మిన్నంటిన కోలాహలం. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎటు చూసినా పండుగ వాతావరణం.. వెళ్తానిక ప్రదర్శనలు.. శాస్త్రీయ పోటీలు.. ఉప్పొంగే ఉత్సాహం, ‘హిప్- ‘హిప్ హుర్రే’ నినాదాలు.. కేరింతలు.. విశాల క్రీడా మైదానంలో అందంగా తీర్చిదిద్దిన వేదిక.. కాంతులు వెదజల్లే విద్యుత్ దీపాలు.. డిజిటల్ స్క్రీన్లు.. హోరెత్తించే సౌండ్ సిస్టమ్స్.. అందంగా అలంకరించిన విలురకాల స్టాళ్ళు.. ఇది గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలోని దృశ్యాలు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

_వివాహ వేదిక: జిఎంఆర్ ఫంక్షన్ హాల్ _వివాహాల తేదీ: మే 7, 2023 _నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.. _త్వరలోనే ముస్లిం, క్రిస్టియన్ల సామూహిక వివాహాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దాతృత్వానికి, మంచితనానికి మారుపేరుగా నిలిచిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో సామూహిక వివాహాలు జరిపించేందుకు నిర్ణయించారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామూహిక వివాహాల కార్యక్రమ వివరాలను ఎమ్మెల్యే […]

Continue Reading

పటాన్చెరులో అంగరంగ వైభవంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, భారీ బైక్ ర్యాలీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి వేడుకలను బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

Continue Reading

మైత్రిలో ముస్తాబవుతున్న మినీ కైలాసం..

_50 అడుగుల భారీ శివలింగం.. 15 అడుగుల ధ్యానముద్ర శివుడు.. _వేద బ్రాహ్మణులచే శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం _సినీ కళాకారులచే సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మహాశివరాత్రి మహా జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారుగురువారం మహా జాగరణ నిర్వహించబోతున్న పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో […]

Continue Reading