మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
విద్యార్థుల ఆట, పాటలతో మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్లో ఆదివారం జరిగిన మెరివాగంజా–2025 కార్నివాల్ సందడిగా జరిగింది. ఈ కార్నివాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపాల్ కరణం భవాని తెలిపారు. మెరివాగాంజ కార్నివాల్–2025 లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఓ జాతర వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. సవారీలు, ఇంటరాక్టివ్ బోర్డు ఆటలు, లక్కీ డ్రా విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుల్లో రాణించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాసంస్థల ఫౌండర్ బుట్టా రేణుక తెలిపారు.