పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు .ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందంటారు. అలాంటి మహాలక్ష్ములకు తన వంతుగా ప్రొత్సాహం అందిస్తున్నారు . తన గ్రామంలో పుట్టిన ప్రతి శిశువుకు ఐదు వేల రూపాయలు ఫిక్డ్స్ డిపాజిట్ చేసి..వారి భవిష్యత్ కు భరోసా కల్పిస్తున్నారు .గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జన్మదినంను పురస్కరించుకుని జూన్ 2 వతేదీ 2022 ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు .గత ఏడాది 22 మంది చిన్నారులకు ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ కార్యక్రమాన్ని నర్విరామంగా కొనసాగిస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 50 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ఫిక్డ్స్ డిపాజిట్ చేసి తన ఉదారత చాటుకున్నాడు . 50 మంది చిన్నారుల తల్లిదండ్రులకు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందించారు .సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు .ముఖ్యంగా కేసీఆర్ కిట్, ఆడ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ లాంటి పథకాలతో చేయూతనందిస్తున్నారు. మహిళ భద్రత కోసం షీ టీంలను ప్రవేశపెట్టి అన్నగా రక్షణ కల్పిస్తున్నాడని తెలిపారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…