మనవార్తలు ,పటాన్ చెరు
అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు కోరారు. సోమవారం ఉదయం తన నివాసంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి బూస్టర్ డోస్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన విధంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
_______________________________________________________
ఐనోల్ మల్లన్న స్వామి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు మండలం ఐనోల్ గ్రామంలో సోమవారం నిర్వహించిన మల్లన్న స్వామి జాతరలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, శంకర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.