సుల్తాన్పూర్ లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు

Districts politics Telangana

మనవార్తలు ,అమీన్పూర్

అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జిఎంఆర్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆషాడం, శ్రావణమాసంలో తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగలు నిర్వహించడం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన తెలంగాణ పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, పారాసోటి మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, సీనియర్ నాయకులు రాజు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *