Telangana

ఆరోగ్య శాఖలో జరుగుతున్న తీరుపై ఏం సమాధానం చెబుతారు_ బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

_ప్రచార ఆర్భాటం తప్ప , ప్రజారోగ్యం పై శ్రద్ద ఏది ?

_పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవా ?

_ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వ్యక్తికి కుట్లు వేసిన వాచ్ మెన్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత వల్ల గాయపడిన యువకుడికి వాచ్ మెన్ కుట్లు వెయ్యడం దురదృష్టకరమని మాజీ జెడ్పీటీసీ, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఆయన శనివారం ముత్తంగి తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యం వహించిన తీరు సరియైనది కాదని, సంఘటన జరిగిన రోజు నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్కరినీ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇందుకు సంబందించిన వీడియోను ఆయన తన మొబైల్ లో విలేకరులకు చూపించారు. వైద్య శాఖ మంత్రి సోంత జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలోని మిగతా ఆసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంఘటన పై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో తమకు వివరణ ఇవ్వాలని లేని పక్షంలో భారతీయ జనతాపార్టీ తరపున పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిని, ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సాయి కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్, బిజేవైయం‌ నాయకులు రాజ్ గోపాల్ యాదవ్, సంగమేశ్వర్, ఆదిత్య, ఎస్ఆర్కే యువసేన సభ్యులు మచ్చ కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago