పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు నియోజకవర్గం ముత్తంగి గ్రామ పరిధిలోని డి.ఎన్ కాలనీలో నూతనంగా వచ్చిన ఓటరు జాబితాను పరిశీలించిన పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు ఫార్మ్ 6 ద్వారా తమ ఓటరు కార్డు ను నూతన జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రస్తుతం ఉన్న నూతన ఓటరు జాబితాను పరిశీలించి,ఇటివల మరణించిన వారి పేర్లను తోలగించాలని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరూ తమ ఓటరు కార్డు ని ఆధార్ కార్డు తో జతపరచుకోవాలని ఇందుకు గాను ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి, ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు షకీల్, బండి నర్సింగ్ యాదవ్, రాము, నరేష్, నాయికోటి రాకేష్, రాహుల్ ముదిరాజ్, వినీత్, తదితరులు పాల్గొన్నారు.