మనవార్తలు , అమీన్పూర్
బీజేపీ నేత అమీన్ పూర్ కౌన్సలర్ ఎడ్ల రమేష్ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందించారు .పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి దేవాలయానికి 1,00000 (లక్ష రూపాయలు) విరాళం అందజేసి దైవ భక్తిని చాటుకున్నారు .శనివారం ఆలయ కమిటీ సభ్యులకు ఆయన విరాళాన్ని అందజేశారు .ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవ భక్తిని అలవర్చుకోవాలని ,మన హిందూ సంప్రదాయాలను గౌరవించాలని, ఆలయాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయనని తెలిపారు.