కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మాణం
పటాన్చెరు:
హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. అంటూ భక్తుల జయజయ ధ్వానాల మధ్య పటాన్చెరు పట్టణంలోని జెపి కాలనీ లో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరువు పట్టణంలో మొట్టమొదటి కృష్ణుడి ఆలయం నిర్మించడం పట్టణ ప్రజల అదృష్టం అన్నారు.
కోటి యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో భక్తులు, దాతల సహకారంతో వచ్చే కృష్ణాష్టమి లోపు గుడి నిర్మాణం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గుమ్మడిదల జడ్పిటిసి కుమార్ గౌడ్, గుమ్మడిదల ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్చెరు పట్టణ పుర ప్రముఖులు దేవేందర్ రాజు, శంకర్ యాదవ్, గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.