Telangana

బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఘనంగా నిర్వహించాలి :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయండి

_ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు..

_భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లు

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.జాతర ఏర్పాట్లపై బుధవారం ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవాల విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.16వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, చలువ పందిళ్ళు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.గత సంవత్సరం ఐదు లక్షల మంది భక్తులు జాతర ఉత్సవాలకు హాజరయ్యారని, ఈసారి మరింత భక్తుల సంఖ్య పెరగవచ్చని అన్నారు.ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆలయ ఈవో శశిధర్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago