_డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్
– అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు
– ఇష్టా విద్యా సంస్థల చైర్మన్ కోట కార్తీక్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రేపటి తరాలకు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గమని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి అమీన్ పూర్ మండలం బీరంగూడలో గల బాలాజీ కన్వెన్షన్ హాల్లో ఇష్టా విద్యా సంస్థల చైర్మన్ కోట కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన ఐఐటి రామయ్య ఇష్టా విద్యాసంస్థల ఫేర్వెల్ పార్టీ సెలబ్రేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాట శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ సివిఎన్ శాస్త్రీయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ… నేటి ఉరుకులు పరుగుల జీవితంలో తమ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంతో శ్రమకోర్చి చదివిస్తున్నారని దానికి అనుగుణంగా విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి భవిష్యత్ తరాలకు పదిమందికి ఉపాధి నిచ్చే విద్యావేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇష్టా విద్యాసంస్థలు ఐఐటి ఫౌండేషన్ / నీట్ ఫౌండేషన్ లక్ష్యంగా, ఈసీఐఎల్ లో మొట్టమొదటి ఐఐటి అకాడమీని 2012 లో ఎమ్మెల్సీ, ఐఐటి చుక్కారామయ్య ప్రారంభించిన ఇష్టా విద్యాసంస్థ 30 మంది విద్యార్థులతో మొదలై అనతి కాలంలోనే 43 ప్రయివేట్ పాఠశాలలకు ఐఐటి/నీట్ ఫౌండేషన్ కోర్సులను అందించడం అభినందనీయమన్నారు.
ఇష్టా విద్యా సంస్థల చైర్మన్ కోట కార్తీక్ మాట్లాడుతూ ఇష్టా సివిల్ సర్వీసెస్ అకాడమీ, ఇష్టా జూనియర్ కాలేజ్, ఇష్టా డిగ్రీ కాలేజి, ఇష్టా బిజినెస్ స్కూల్ లను ప్రారంభించి, మంచి విద్య బోధన అందిస్తూ ర్యాంకులతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు చెప్పారు. ఇష్టా సంస్థ యొక్క అవకాశాలను, అవసరాలను వినియోగిస్తున్న సమయంలో కోవిడ్ – 19 కరోనా భయంకరమైన మహమ్మారి దేశమంతుట విద్యాసంస్థలను విద్యార్థుల జీవితాలను ధ్వంసం చేసిందని, ఇష్టా విద్యాసంస్థలు సహా కరోనా ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయినా వెనుకంజ వేయకుండా ఆన్లైన్ విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయ బృందాలను కుటుంబాలకు సహకారం అందించిందని, ఇదే సందర్భంలో విద్యార్థుల కుటుంబాలకు ఇష్ట నిర్వహిస్తున్న ప్రాంతాలలో 80కి పైగా బస్తీలలో, గ్రామాలలో ఆహారం, నిత్యవసర సరుకులు పంపిణీ చేసి మానవతా దృక్పథంతో సేవలు అందించాయన్నారు.
రెండు సంవత్సరాలు ఇష్టా విద్యాసంస్థలు సేవలు అందించి తమ లక్ష్యాన్ని సాధిస్తూ పురోగమనములో పయనిస్తూ విద్యార్థి లోకానికి దశ దిశను నిర్దేశిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసనిస్తూ ముందుకు సాగుతూ10 వసంతాలు పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇష్టా విద్యాసంస్థలు నేడు ఆంధ్రప్రదేశ్ లో 4 బ్రాంచ్ లు, తెలంగాణలో 7 బ్రాంచ్ లతో మొత్తం 11 బ్రాంచ్ లతో కార్పోరేట్ కి మించిన విద్యని అందిస్తూ ఎన్నో స్టేట్ ర్యాంకులు, ఐఐటీ, నీట్ ర్యాంకులు సాధించడం మా ఇష్టా విద్యా సంస్థలకే చెల్లిందన్నారు. ఈ సందర్భంగా ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెట్స్ నాగరాజ్, జోసెఫ్, ప్రమోద్, అమరేందర్, రమేష్, దీప, విలియమ్స్, ప్రవీణ, ఇష్టా విద్యాసంస్థల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…