పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వేసవికాలంలో అగ్ని ప్రమాదాల జరిగే అవకాశాలు ఉంటాయని, ప్రజలు పరిశ్రమల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.. విపత్తు మరియు అగ్నిమాపక నిరోధక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఫైర్ ఆఫీసర్ జన్య నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.