అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన బీసీ ఐక్యవేదిక

politics Telangana

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

శేరిలింగంపల్లి నియోజక వర్గం అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న ధర్నాలో శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక తమ పూర్తి మద్దతుతో సంఘీభావం తెలిపారు. గత రెండు రోజులుగా మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మద్దతు తెలిపారు. ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఏ పోరాటానికైనా బీసీ ఐక్యవేదిక మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ విషయాన్ని సి ఎం దృష్టికీ తీసుకెళ్తామని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా నిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ న్యాయమైన కోరికల గురించి పోరాటం ఉధృతం చేయడం కోసం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాటంలో కూడా రాజకీయ పార్టీలు మరియు అన్ని సంఘాల నాయకులు మద్దతు అందించాలని కోరారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న న్యాయమైన కోరికలు నెరవేరే వరకు ధర్నాలు రాస్తారోకోలు ఉద్యమించటానికి వెనుకాడబొమని తెలిపారు. ఉమ్మడిమెదక్ జిల్లా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు నర్సింలు ముదిరాజ్ సంఘీభావం తెలుపుతూ పూర్తి మద్దతు ప్రకటించారు. సి ఐ టి యూ కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మియాపూర్ బీసీ అధ్యక్షులు నరసింహ ముదిరాజ్ మద్దతుగా ప్రసంగించారు. అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ ప్రాజెక్టు లీడర్ నాగమణి తమ న్యాయమైన కోరికలు చదివి వినిపించారు. తమతో ప్రభుత్వం వెట్టి చాకిరీ ఛేహించుకొని, నేడు మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ ధర్నా లో అంగన్వాడి టీచర్స్ వర్కర్స్ సుమారుగా 200 మంది పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నాయకులు సరోజనమ్మ, పూజ, ఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *