Telangana

బీసీ కులగణన చారిత్రాత్మకం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్

మాటల్లో కాదు చేతల్లో చూపిన నాయకుడు రేవంత్ రెడ్డి 

తెలంగాణలో పెరగనున్న బీసీల రాజకీయ అవకాశాలు

బీసీ లోకమంతా కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి కి రుణపడి ఉంటాం

ముఖ్యమంత్రి ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేశంలో ఎక్కడ లేని విధంగా జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసిన బీసీ కులగణన చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో నీలం మధు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించి తెలంగాణలోని బీసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్నా రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం లేక చాలామంది బీసీలు నాయకులుగా ఎదగలేకపోయారని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్ సంకల్పంతో కులగణన ని చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ వర్గాలకు కులగణన పట్ల ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ప్రజలకు సంక్షేమం అభివృద్ది సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రానున్న రోజుల్లో బీసీ బిడ్డలంతా రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తూ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ బీసీలమంతా రుణపడి ఉంటామన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago