సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని పుల్కల్ లోని గ్రౌండ్ నందు పుల్కల్ మండల మహిళ అధ్యక్షురాలు శివమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఆడపడుచుల ఆట పాటలు కోలాటాలు ఆకాశనంటాయి ముందుగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.జిల్లా చేర్పర్సన్ మంజు శ్రీ జ్యోతిప్రజ్వలన చెననంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరాల పంపిణీ చేశారు.బ తుకమ్మఆట ప్రారంభోత్సవం బ్రహ్మణులచే పూజ కార్యక్రమం నిర్వహించి బతుకమ్మ ఆట ను ప్రారంభించారు.
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను పుల్కల్ మండల మరియు సంగారెడ్డి జిల్లా గ్రామాల ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని పుల్కల్ మండల జడ్పిటిసి సంగారెడ్డి జిల్లా మండల చేర్పర్సన్ మంజు శ్రీ అన్నారు.బతుకమ్మ పండుగా ప్రారంభోత్సవం సందర్భంగా ఆందోల్ నియోజకవర్గ శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతూ పుల్కల్ మండల ప్రజలకు ఆందోల్ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ బతుకమ్మ దసరా పండుగ పేదవారు ధనికులు అని తేడా లేకుండా జరుపుకునే పండుగ అన్నారు ఈ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు అడపచులు అందరూ కల్సి ఆడే గోప్ప పండగ బతుకమ్మ పండుగ అని.దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అన్నారు.
టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు.ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం ద్వారా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు.ఈ దసరా బతుకమ్మ పండుగను ప్రజలందరు కనులవిందుగా ఆనందోత్సాహాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో జిల్లా చేర్పర్సన్ మంజు శ్రీ.ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి. పుల్కల్ ఎమ్మెర్వో పరమేశ్వర్.ఎంపీడీఓ మధులత. ఎసై నాగలక్ష్మి. ఏ ఎసై మల్లేశ్వర్.ఎసై సతీష్. పుల్కల్ మండల టి ఆర్ స్ అధ్యక్షులు మాచర్ల విజయ్ కుమార్. ఉపాధ్యక్షులు బస్వపూర్ విష్ణయ్య.మునిపల్లి జడ్పీటీసీ మీనాక్షి. పుల్కల్ ఎంపీటీసీ శ్రీనివాస్ చారి.మండల మహిళా అధ్యక్షురాలు తలారి శివమ్మా. ఉమ్మడి పుల్కల్ మండల టి ఆర్ స్ గ్రామాల సర్పంచ్ లు. ఉప సర్పంచ్ లు.గ్రామ అధ్యక్షులు.ఎంపీటీసీ లు.వార్డు మెంబర్లు.టి ఆర్ స్ నాయకులు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.