మనవార్తలు ,అమీన్ పూర్:
ప్రజాఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.అమీన్ పూర్ లో బస్తీ దవాఖాన నూతన భవనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు ప్రజల సుస్తిని పోగెట్టుఎందుకు పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు మందులు అందుతున్నాయని అన్నారు.నిరుపేద నీడలో మెరుగైన వైద్య సౌకర్యం ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
బస్తీ దవాఖానాల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడం సహా బీపీ, షుగర్‌తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తామని ఇక పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో బస్తీ దవాఖాన ఎంతో దోహదపడుతుందని మంత్రి హరీష్ రావ్ అన్నారు .57 రకాల రక్త పరీక్షలు చేస్తాం..మెసేజ్ రూపంలో రిపోర్ట్స్ పంపిస్తాం..ఉచితంగా మందులు అందిస్తాం ఆదివారం సైతం పని చేస్తుంది అని ,బీపీ షుగర్ ఉన్న వారికి నెలకు సరిపడా మందులు అందిస్తామని ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు .
ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కలిపించాలని, నార్మల్ డెలివరీలు జరిగేల చూడాలని ఆశ , ఏ ఎన్ ఎం లను మంత్రి హరీష్ రావు గారు సూచించారు. ప్రజలు ప్రయివేటు ఆసుపత్రి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.2 కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో పటాన్ చెరు ఆస్పత్రిలో సిటి స్కాన్ ఏర్పాటు చేశాం,18 మంది డాక్టర్ల ను ఏర్పాటు చేశాం, ముహూర్తాల పేరుతో సీజరియాన్ ఆపరేషన్లు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్దతి కాదు అని తెలిపారు .త్వరలో పటాన్ చెరులో 200 పడకలు అత్యాధునిక వసతులు ఆధునిక శస్త్ర చికిత్సలు.దీంతోపాటు ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఇందులో ఉంటాయని ,త్వరలో సీఎం కెసిఆర్ తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.