_స్మశాన వాటిక కు నిధులు మంజూరు అయిన పూర్తి కాని పనులు
_నాలాల విస్తరణ, కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేయాలని రవి కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు *
మనవార్తలు , శేరిలింగంపల్లి :
చందానగర్ డివిజన్ పోగుల ఆగయ్య నగర్ లో స్థానిక నాయకులతో, ప్రజలతో సమస్యలపై బస్తీ బాట కార్యక్రమాన్ని చెప్పట్టారు రవి కుమార్ యాదవ్, ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ.నేటి తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప చేతలకు ఆమడ దూరంలో ఉందని, ఏండ్లు గడుస్తున్నా నిధులు మంజూరై గ్రామంలోని స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హాయంలో నిధులు మంజూరు చేసిన గాని ఈ చేతగాని ప్రభుత్వం స్మశాన వాటిక పనులను పట్టించుకోకపోగా అక్కడ చెత్త చెదారం చేరి రాత్రి వేళలో విషసర్పాల భయంతో అక్కడి ప్రజలు జీవనం గడుపుతున్నారు అని తెలియజేశారు .
అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు నాలాల పై ఇల్లు నిర్మించుకోవడం వలన వర్షపు నీరు డ్రైనేజ్ వాటర్ పోనీ కారణంగా కాలనీ ముంపునకు గురవుతుందని వెంటనే నాలాల విస్తరణ చేపట్టి , ప్రతి రోజు పారిశుద్ధ్యం చెయ్యాలని జిహెచ్ఎంసి అధికారులను కోరడం .అదేవిధంగా స్థానిక ప్రజల అవసరాల కోసం ఒక కమ్యూనిటీ హాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి ,వెంకటేష్, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి ,రామకృష్ణ, వినోద్ యాదవ్, గణేష్ ముదిరాజ్, బాబు, శ్రీను, రాము మొదలగు వారు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…