హైదరాబాద్‌లో తమ9వ రెస్టారెంట్‌ను తెరిచిన బార్బిక్యు నేషన్‌

Hyderabad Lifestyle

మనవర్తలు, శేరిలింగంపల్లి :

భారతదేశంలో అగ్రగామి క్యాజువల్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ చైన్‌, బార్బిక్యు నేషన్‌ దేశ వ్యాప్తంగా తమ 167వ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌ నగరంలో మధీనగూడా లోని జీఎస్‌ఎం మాల్‌ లోఈ రెస్టారెంట్‌ను ఎన్‌జీఓ –హోప్‌ ఫర్‌ లైఫ్‌కు చెందిన చిన్నారులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఫుడీస్‌ ఇప్పుడు తమ సొంత మాంసాహార మరియు శాఖాహార బార్బిక్యులను రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ వద్దనే గ్రిల్‌ చేసుకోవచ్చు. బార్బిక్యునేషన్స్‌ 167వ ఔట్‌లెట్‌లో ఒకేసారి 128 మంది అతిథులు కూర్చోవచ్చు. ఈ రెస్టారెంట్‌ను అతి జాగ్రత్తగా బార్బిక్యు బ్రాండ్‌ సిద్ధాంతం, వారసత్వం పరిగణలోకి తీసుకుని తీర్చిదిద్దారు.

బార్బిక్యు నేషన్‌ రెస్టారెంట్‌, దేశంలో అతి పెద్ద క్యాజువల్‌ డైనింగ్‌ బ్రాండ్‌గా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. టేబుల్‌ గ్రిల్‌పై లైవ్‌ క్యుసిన్‌ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ రెస్టారెంట్‌లో ముందుగా నిర్థేశించిన మోనూను స్థిరమైన ధరతో అందిస్తారు. ఈ మెనూను మెడిటెర్రానియన్‌, అమెరికన్‌,ఓరియెంటల్‌, ఆసియన్‌, ఇండియన్‌ క్యుసిన్స్‌తో తీర్చిదిద్దారు. వినియోగదారులు తమ స్టార్టర్స్‌ను విస్తృత శ్రేణి మారినేడ్స్‌, సాస్‌లలో తమ టేబుల్స్‌ వద్ద ఆస్వాదించవచ్చు.స్టార్టర్స్‌లో భాగంగా నాన్‌ వెజిటేరియన్స్‌ అత్యంత ప్రాచుర్యం పొందిన మెక్సికల్‌ చిల్లీ గార్లిక్‌ ఫిష్‌ , హాట్‌ గార్లిక్‌ చికెన్‌ వింగ్స్‌, తందూరీ తంగ్డీ, కాజున్‌ షీక్‌ కెబాబ్‌, కోస్టల్‌ బీబీక్యు ప్రాన్స్‌, మరియు మరెన్నో ఉన్నాయి.

శాఖాహారుల కోసం నోరూరించే కుటి మిర్చ్‌కా పన్నీర్‌ టిక్కా, దాహీ కే కబాబ్‌, గ్రిల్డ్‌ మష్రూమ్‌ వంటివి ఉన్నాయి. మెయిన్‌ కోర్సు విభాగంలో నాన్‌ వెజిటేరియన్స్‌కు చికెన్‌ దమ్‌ బిర్యానీ, రాజస్తానీ లాల్‌ మాస్‌, దమ్‌ కా ముర్గ్‌ వంటివి ఉంటే, శాఖాహారులకు పన్నీర్‌బటర్‌ మసాలా వంటివి లభిస్తాయి.బార్బిక్యు నేషన్‌ హాస్పిటాలిటీ లిమిటెడ్‌ వీపీ సౌత్‌– అరుప్‌ చటర్జీ మాట్లాడుతూ‘‘అపరిమిత వేడుకలు, రుచికరమైన గ్రిల్స్‌కు ఒకే ఒక్క కేంద్రంగా బార్బిక్యునేషన్‌ ఉంటుంది. బార్బిక్యువద్ద ముము వైవిధ్యత మరియు రుచి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారికి మరుపురాని అనుభూతలను మిగులుస్తుంటామని తెలిపారు. అనంతరం హాఫ్ పర్ లైఫ్ చిన్నారులకు స్కూల్ బ్యాగులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *