-పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ గురువారం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా పటాన్‌చెరు ఐబీ అతిథి గృహంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో నేటి దినపత్రిక సూర్య పటాన్ చెరు,రిపోర్టర్ బక్కోల్ల రాముకు సహాయ కార్యదర్శిగా అవకాశం దక్కింది.ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీలో నన్ను సహాయ కార్యదర్శిగా ఎన్నుకుని నాపై నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ అవకాశం కల్పించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్,జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్, రాష్ట్ర నాయకులు మేకల కృష్ణయ్య, ప్రభు జాతీయ కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి , అలాగే నూతనంగా ఎన్నికైన పటాన్‌చెరు నియోజకవర్గ అధ్యక్షులు బాదిని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యంతో పాటు నా తోటి సహాయ కార్యదర్శులు గిరి,ప్రసాద్, కృష్ణాగౌడ్ ఉన్నారు. నాపై విశ్వాసం ఉంచిన సహచర జర్నలిస్టు మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూమీ అందరి ఆశయాలకు అనుగుణంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సంఘ బలోపేతం కోసం నిబద్ధతతో పనిచేస్తానని రాము తెలియజేశారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…