Telangana

బాబు జగ్జీవన్ రావ్ దేశానికి స్ఫూర్తిదాయకం: బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఏక్ దేశ్ మె..దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా..”అంటూ నినదించి, కాశ్మీర్ భారత్ లోని అంతర్భాగమనీ నిరంతర పోరాటం చేసి అమరుడైన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రసాద్ ముఖర్జీ పటాన్చెరు మాజీ జడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని గురువారం ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని దేశ రాజకీయ చరిత్రలో నిలిచి ఉండే గొప్ప దాశనీకుడు అని ,ప్రధానంగా దేశంలోని షెడ్యూలు కులాలు, అనగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. నేటితరం యువతరానికి, ప్రజాప్రతినిధులకు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు మండలం ఉపాధ్యక్షుడు సాయికుమార్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధనరాజ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి దీపక్ గౌడ్, మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు షాపీ, శకిల్, రాము, కుమార్, అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ఐనోల్ మల్లన్న స్వామి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…

21 hours ago

కాంగ్రేస్ నయవంచన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ…

22 hours ago

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువత…

23 hours ago

దేశ సాంకేతిక, ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తున్న డ్రోన్లు

ఐదు రోజుల బూట్ క్యాంప్ ప్రారంభోత్సవంలో సీ-డాక్ హైదరాబాద్ నిపుణుడు ప్రణయ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మన దేశ…

23 hours ago

ఆర్కిటెక్చర్ కోర్సు, కెరీర్ అవకాశాలపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…

3 days ago

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

4 days ago