Hyderabad

గీతంలో శాస్త్ర, సాంకేతికలపై వ్యాసరచన పోటీ…

గీతంలో శాస్త్ర, సాంకేతికలపై వ్యాసరచన పోటీ…

– స్వాతంత్ర్య దినోత్సవం నాడు బహుమతి ప్రదానం

పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీలు కలిసి సంయుక్తంగా శాస్త్ర, సాంకేతికతలపై గీతంలో చదుతున్న విద్యార్థులకు వ్యాస రచన పోటీని నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు శుక్రవారం పేర్కొన్నారు . జాతి నిర్మాణంలో యువత పాత్ర (యువత శక్తి, సమగ్రత నిబద్ధత, ప్రకృతి పరిరక్షణలో మన బాధ్యత, కుటుంబం సమాజంతో ఉన్న అనుబంధం, సామాజిక సమస్యల నివృత్తిలో పాల్గొనడం) గాంధేయ తత్వశాస్త్రం వర్తమానంలో దాని ఔచిత్యం (సత్యం – అహింస, సత్యాగ్రహం, స్వరాజ్యం, స్వదేశీ, స్వచ్ఛభారత్) జాతీయ విద్యా విధానం, విలువలు – దాని కొత్తదనం ఏమిటి ? (జ్ఞానము – విద్య, విద్య ఇంటి నుంచే ప్రారంభమవుతుంది, విద్యార్థులకు నైతికత, విలువల యొక్క ప్రాముఖ్యత, అంతర్ విభాగ కోర్సులు, విద్యా సంస్థలు ఎలా ఉండాలి?) వంటి అంశాలలో ఏదో ఒక దాని పై వ్యాసరచన చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. చేతి వ్రాత ప్రతులను స్కాన్ చేసి, సంబంధిత ప్రిన్సిపాల్ ధ్రువీకరణతో essaygitam@gitam.in కు పంపాలని, టైప్ చేసిన వ్యాసాలను అంగీకరించబోమని ప్రొఫెసర్ రామారావు స్పష్టీకరించారు. వచ్చిన వ్యాసాల నుంచి కేవలం 30 మాత్రమే ఎంపిక చేస్తామని, వాటిని రాసిన వారు 2021 జులై చివరి వారంలో ఆన్ లైన్ ద్వారా వాటిని వివరించాల్సి ఉంటుందని తెలిపారు. తొలి స్థానంలో నిలిచిన వారికి పది వేల రూపాయలు, రెండో స్థానానికి ఆరు వేలు, మూడో బహుమతిగా మూడు వేలు, మిగిలిన 27 మందికి ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున ప్రశంసాపూర్వక నగదు పురస్కారాలను స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందజేస్తామని ప్రొఫెసర్ రామారావు వివరించారు. వ్యాసాలను 2021 జులై 15వ తేదీలోగా పంపాలని, ఆన్‌లైన్ ప్రజెంటేషన్ అదే నెల 31న ఉంటుందని, బహుమతి ప్రదానం ఆగస్టు 15న చేస్తామన్నారు . ఇతర వివరాల కోసం 9000 638 872 లేదా principalscience_ hyd campus@gitam.edu కు ఈమెయిల్ చేయాలని ప్రిన్సిపాల్ సూచించారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago