2030 నాటికి మానవ మేధస్సుతో సరిపోలే కృత్రిమ మేధస్సు 

Telangana

– గీతం కార్యశాలలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిబా ఉద్గత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రానున్న ఐదారేళ్లలో, బహుశా 2030 నాటికి మానవ మేధస్సుతో కృత్రిమ మేధ (ఏఐ) సరిపోలుతుందని, ప్రస్తుతం అది మనం నిర్దేశించిన పని చేయడానికే పరిమితమైందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఏఐలో ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ సిబా ఉద్గత అంచనా వేశారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లొని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ కార్యశాల ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సాధించడానికి సాధారణ జ్ఞానంతో కూడిన కృత్రిమ మేధ నమూనాలను అభివృద్ధి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.సమాచార (డేటా) సేకరణలో గోప్యత, భద్రత, న్యాయబద్ధతల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, బాధ్యతాయుత మైన కృత్రిమ మేధ అభివృద్ధి ఆవశ్యకతను ప్రొఫెసర్ ఉద్గత నొక్కి చెప్పారు. కృత్రిమ మేధలో శోధించేవారు, తాము కనుగొన్నది సమాజంపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సమస్యను గుర్తించి, దానిని నిర్వహించి, అందుకు తగ్గ పరిష్కారాలను చూపాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

భారతీయ నిపుణులు సమస్యకు పరిష్కారం కనుగొనడంలో దిట్ట అయినా, దానిని గుర్తించి, నిర్వచించడంలో వెనుకబడినట్టు డాక్టర్ ఉద్గత చెప్పారు.వేగంగా మారుతున్న కృత్రిమ మేధ రంగంలో పుననెపుణ్యం పొందం, పుననైపుణ్యలను మెరుగుపరచుకోవడం ఆవశ్యకతను జియో ప్లాట్ ఫామ్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ డాక్టర్ ఆకాంక్ష కుమార్ నొక్కి చెప్పారు. ఈ రంగంలో రాణించాలంటే, పరిశ్రమ భాగస్వామ్యంతో నిరంతర అభ్యాసంతోపాటు ఇతరులతో కలిసి పనిచేయాలని సూచించారు. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ రాధికా మామిడి, ఆవిష్కరణల సాకారంలో యువత పాత్రను నొక్కి చెప్పారు. భవిష్యత్తు కెరీర్ అవకాశాల గురించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. వర్చువల్ సభాధ్యక్షత వహించిన గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ మాట్లాడుతూ, గణితం, కృ త్రిమమేధ పరిశోధనలో కొత్త మార్గాలను అన్వేషించాలని, ఈ కార్యశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.దాదాపు 150 నుంది పాల్గొన్న ఈ వర్క్ షాప్, కృత్రిమ మేధ, పెద్ద భాషా నమూనాలలో తాజా పురోగతులపై చర్చ, పరస్పర సహకారానికి వేదికగా నిలిచింది. కార్యశాల నిర్వాహకుడు డాక్టర్ మోతహర్ రెజా, సమన్వయకర్తలు డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, డాక్టర్ కృష్ణ, కుమ్మరి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *