మన జీవితాల్లో ప్రతిచోటా కృత్రిమ మేథ…

Telangana

– గీతమ్ ఆరంభమైన ‘కృత్రిమ మేథ, దాని వినియోగం’ కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కృత్రిమ మేథ (ఏఐ) అనేది మన జీవితాల్లో ప్రతిచోటా ఉందని, ఈ-మెయిల్స్ను చదవడం నుంచి వాహనాన్ని ఎటుగా నడపాలో సూచించే రోజువారీ కార్యకలాపాల వరకు ప్రతిదీ ఏఐతో ముడిపడి ఉందని కోల్ కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అన్సుమన్ బెనర్జీ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని, గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన ‘కృత్రిమ మేథ, దాని వినియోగం’ అనే అంశంపై రెండు రోజుల వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘మోడరన్ ఏఐ మీట్స్ క్లాసికల్ ఏఐ’ అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. కృత్రిమ మేథను సరైన దిశలో వినియోగించుకోవాలని, మనకు సహాయపడేలా జాగ్రత్త వహించాలని సూచించారు.కోలకతాలోని టీసీఎస్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో సీనియర్ సెంటిస్ట్ డాక్టర్ హిమాద్రి శేఖర్ పాల్ రోబోటిక్స్ప ప్రసంగించారు. ఐఐటీ గౌహతికి చెందిన డాక్టర్ మనీష్ కుమార్ రక్షణ రంగంలో కృత్రిమ మేథ వినియోగంపై ప్రసంగించారు.

తొలుత, సభాధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేషా మాట్లాడుతూ, కృత్రిమ మేథ అనేది అంతర్ విభాగ అంశమని, ఈ వర్క్షాప్లో చురుకుగా పాల్గొని, దానిపై మంచి అవగాహనను ఏర్పరచుకోవాలని. విద్యార్థులకు సూచించారు. కార్యక్రమ నిర్వాహకుడు, గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజా తన ప్రారంభోపన్యాసంలో గణిత శాస్త్ర విభాగం, అది నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరించగా, సమన్వయకర్తలు డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, డాక్టర్ కె. కృష్ణ వందన సమర్పణ చేశారు.అమెరికన్ సొసెట్రీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ప్రారంభం గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆధ్వర్యంలో ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్’ (ఏ,ఎస్ఎంఈ) విద్యార్థుల విభాగాన్ని శుక్రవారం అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్, విద్యార్థి విభాగం సలహాదారు డాక్టర్.. వి.జీవన్, ఏఎస్ఎంఈ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వరుణ్ పర్మార్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గీతమ్ కంటి పరీక్ష శిబిరం..

ఎక్కువ మంది విద్యార్థులు మొబెలు విరివిగా చూడడం, అల్ట్రావెలైట్ కిరణాలకు గురికావడం, ధూమపానం వంటివి క్రమంగా కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో శుక్రవారం హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించి, తగు నివారణా సూచనలు చేశారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని, తమ కళ్లను పరీక్షించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *