తిరుమల:
సామాన్య భక్తులకు సైతం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కల్పించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్వదర్శనం టికెట్ల కోటాను పునరుద్ధరించగా.. ఇటీవల ఆన్‌లైన్‌లో అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు భక్తులు టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు సూచనలు చేసింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదంటే.. దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పలువురు భక్తులకు దర్శనం టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి దర్శనం టోకెన్లు, టికెట్లు లేని భక్తులను వెనక్కి పంపుతున్నారు. ఈ క్రమంలో భక్తులు గమనించి, సహకరించాలని టీటీడీ కోరింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…