మనవార్తలు ,పటాన్ చెరు:
హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ చివరి ఏడాది బీటెక్ ( సీఎస్ఈ ) విద్యార్థిని ఆముక్త చౌదరి గద్దె ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ఐఎస్బీ ) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ ( పీజీపీ ) చదవడానికి అర్హత సాధించింది . యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ ( వెస్టైల్పీ ) లో భాగంగా , క్లాస్ -2025 పేరిట నిర్వహించనున్న పీజీపీ కోర్సులో ఆమె 2024 ఏప్రియల్లో ప్రవేశం పొందనున్నట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో వర్చూషా , టీసీఎస్లకు ఆముక్త ఎంపికయినట్టు తెలిపారు . స్నాతకోన్నత ( యూజీ ) , స్నాతకోత్తర ( పీజీ ) కోర్సులను అభ్యసించే విద్యార్థులు వెబైల్పి కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు .
దీనికి అర్హత సాధించినవారు 20 నెలల పాటు ఏదెన్జా పరిశ్రమలో పనిచేసిన అనుభవాన్ని తప్పనిసరిగా పొందాలని , అదే సమయంలో వారాంతాలలో ఐఎస్బీలో పీజీపీ చేస్తున్న విద్యార్థులు , అధ్యాపకులను కలిసి విషయ సంగ్రహణ చేయాల్సి ఉంటుందని వివరించారు . కోర్సు ఆరంభమయ్యే నాటికి ఇవన్నీ సంతృప్తికరంగా పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు . ఐఎస్బీలో ప్రవేశం సాధించిన ఆముక్తను గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…