పటాన్చెరు:
పెరోవ్ స్కెట్, డై – సెన్సిటెజెతడ్ సౌర ఘటాల కోసం శక్తిని నింపే రవాణా పరికరాల అభివృద్ధిపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి కల్పన దీవి ని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి బుధవారం వెల్లడించారు. వివిధ సౌర ఘటాల సాంకేతికతలలో పాల్గొన్న శక్తిని నింపే రవాణా సామగ్రికి సంబంధించిన సవాళ్ళను పరిష్కరించడం ఈ సిద్ధాంత వ్యాసం యొక్క లక్ష్యంగా ఆయన తెలిపారు. ఈ పరిశోధన ద్వారా డై సెన్సిటెజెతడ్ సౌర ఘటాలకు ప్రత్యామ్నాయాలను రూపొందించామన్నారు. కల్పన సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు పేర్కొన్నారు.
గీతంలో ఎన్ సీసీ క్యాంపు
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, ఎన్ సీసీ 33 తెలంగాణ బెటాలియన్, సంగారెడ్డి ఆధ్వర్యంలో పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సీఏటీసీ) ని ఈనెల 6 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన దాదాపు 450 మంది విద్యార్థులు ఈ క్యాంపులో పాల్గొననున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో పాల్గొనే క్యాడెట్లకు ఆయుధ శిక్షణ, డ్రిల్, ఫెర్డింగ్, న్యూస్ రీడింగ్, వ్యక్తిత్వ వికాసం, జీవనశైలి వ్యాధులపై అవగాహన వంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఇక చదవండి
సామాన్యుడిపై మరో భారం.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర
అధిక వడ్డిలు వసూలు చేస్తే నేరుగా సమాచారం ఇవ్వండి : డిఐజి రంగనాధ్
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…