మరో రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిన గీతం పూర్వవిద్యార్థిని

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కనిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు మరో రెండు (16, 17వ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు. 1,900 ఒరిగామి కుక్క బొమ్మలతో పాటు 1,4000 ఒరిగామి డయనోసారస్లను (రాక్షస బల్లులు) ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం, అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పినట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఇంతకు మునుపు, శివాలి కుటుంబం చేతితో తయారు చేసిన కాగితపు బొమ్ములు, క్విల్డ్ పువ్వులు, ఒరిగామి వేల్స్, సెంగ్విన్లు, సిట్రస్ పండ్లు, మాపుల్ ఆకులు, మరికొన్నింటితో సహా వివిధ ప్రదర్శనలతో 1.5 గిన్నిస్ ప్రపంచ రికార్డులను పొందింది. ఇవే కాక, 15 ఆసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, 10 యూనిక్ వరల్డ్ రికార్డులను శివాలి కుటుంబం కలిగి ఉందని వివరించారు.మొత్తం 17 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరక్టర్  డీఎస్ఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్  ప్రొఫెసర్ సి.ఆర్.శాస్త్రి, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *