యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

Telangana

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం

మనవార్తలు ,విజయవాడ:

స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, సమాజ సేవలో నిరంతర కృషికి గుర్తింపుగా యండిఆర్ ఫౌండేషన్‌కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.సామాజిక సేవా రంగంలో యండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అధ్యక్షుడు జయరాం కోమటి ముఖ్య అతిథిగా పాల్గొని యండిఆర్ ఫౌండేషన్ ప్రతినిధులకు అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా జయరాం కోమటి  మాట్లాడుతూ యండిఆర్ ఫౌండేషన్ అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, సమాజానికి అంకితభావంతో సేవ చేసే ఒక ఉద్యమం పేదలు, అనాథలు, విద్యార్థులు, యువత కోసం ఈ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, సంఘ నాయకులు, సామాజిక కార్యకర్తలు యండిఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు.విద్యా ప్రోత్సాహం, పేదలకు ఆర్థిక సహాయం, సామాజిక సేవా కార్యక్రమాలు, అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, యువతకు మార్గనిర్దేశం మరియు ప్రోత్సాహం వంటి అనేక రంగాల్లో యండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా మానవతా విలువలను కాపాడుతూ, అవసరమైన వారికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న యండిఆర్ ఫౌండేషన్ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా మారుతోందని వక్తలు పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు మరింత ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.ఈ అవార్డు ద్వారా యండిఆర్ ఫౌండేషన్ సేవలకు మరింత గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో ఇంకా విస్తృత స్థాయిలో సేవలు అందించేందుకు ఇది ప్రోత్సాహంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *