త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు

politics Telangana

_చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి – నాగపూరి రమేష్

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మంగళవారం రోజు మియాపూర్ మదీనా కూడా లోని త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్, రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ బాస్కర్ రెడ్డి, త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్రచౌదరి లు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల ద్వారా రోగనిరోదక శక్తి మరియు మానసికంగానూ, శారీరికంగానూ దృఢంగా తయారవుతారని తెలిపారు.

క్రీడల్లో పాల్గొనడం రాణించడం, ఛాంపియన్షిప్ కోసం పోరాడాలని, అందుకు ప్రతి విద్యార్థికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత చేసే పనిపై ఆసక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు కళ్ళలాంటివని, వాటిని రెండింటిని సామానoగా పాటిస్తూ రెండిట్లో రాణించాలని కోరారు క్రీడారంగాన్ని తమకేరిర్ రంగంగా ఎంచుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించి తాము చదువుకున్న స్కూల్స్ కి తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆడుకోవాలని తపన కోచ్ ల పట్ల గౌరవం, స్నేహభావం పెంపొందించుకుంటే, పోటీల్లో చివరి వరకు నిలబడడం వల్ల విజయాలు చేకూరుతాయని అన్నారు.

క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, గెలిచిన వెంటనే పొంగిపోకుండా కృతజ్ఞతా భావంతో ఉండాలని, ఓడిన వారిని ప్రోత్సహించాలని సూచించారు. గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ, త్రివేణి పాఠశాలలో క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని, విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి కి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మార్చి పాస్ట్ తో పాటు, శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించారు సి ఎ సి నాటకం డా. నటరాజు, సి ఆర్ ఓ సాయి నరసింహారావు, నరేష్ ఫోర్ ఏ సెంట్రల్ 111 కో ఆర్డినేటర్ చక్రి. సుబ్బారావు. పాఠశాల ప్రధానాచార్యులు, కృష్ణ, మాలిని, జగదీశ్వర రావు, వైస్ ప్రిన్సిపల్ హిమబిందు, అనిత, మరియు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *