మనవార్తలు ,మెదక్:
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి వైయస్సార్ పేరు మార్చడం తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ఇళ్లేందుల రమేష్ గారు తెలిపారు.ఎన్టీఆర్ గారి పేరు మార్చడం బాధాకరం, దీనిని తెలుగు ప్రజలు అంగీకరించరు. ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టాలన్న బిల్లు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిరంకుశ, తుగ్లక్ నిర్ణయాలతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఈ సందర్భంగా తెలిపారు. మీరు ఎన్ని చేసినా ఎన్టీఆర్ చరిత్రను మార్చలేరు.
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ ను విడదీయలేరు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన దుర్మార్గమైన చర్య, దీనిని తెలుగు ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తుగ్లక్ నిర్ణయాలతో మంట గలపలేరు. తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న ఎన్టీఆర్ పేరు మారుస్తారా? తెలుగు జాతికి ఇదొ దుర్ధినం. ఎన్టీఆర్ పేరు మార్చడా నికి ఎలా మనసు ఒప్పిందో జగన్ ప్రభుత్వం తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని తెలిపారు ఇప్పటికైనా ఎన్టీఆర్ పేరుతో ఏర్పడ్డ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని లేదంటే జగన్ ప్రభుత్వాన్నిప్రజలు అస్యహించుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు